: 'నన్ను ఫేస్ బుక్ ఫ్రెండ్ గా చేర్చుకోండి' అంటున్న పాకిస్థానీ
పుర్రెకోబుద్ధి అన్నారు పెద్దలు. సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవాలని, సోషల్ మీడియాలో ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండాలని, తాము పెట్టే పోస్టులు, కామెంట్లకి మంచి గుర్తింపు రావాలని కోరుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి పాకిస్థానీ ఏకంగా రోడ్డు పక్కన పెద్ద హోర్డింగ్ పెట్టి మరీ తనను ఫేస్ బుక్ ఫ్రెండ్ గా చేసుకోవాలని కోరుతున్నాడు. రెహాన్ అల్లావాలా అనే వ్యక్తి, తనకు లక్షల్లో స్నేహితులు ఉండాలనే కోరిక ఉందని, తనను ఫేస్ బుక్ ఫ్రెండ్ గా చేసుకోవాలని కోరుతున్నాడు. ఈ హోర్డింగ్ లో తన ఫేస్ బుక్ వివరాలు పొందుపరిచాడు. ఈ హోర్డింగ్ చిత్రంగా ఉన్నా అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతానికి ఇతని ఫేస్ బుక్ ఖాతాలో 5, 34,270 మంది ఉండడం విశేషం. మొత్తానికి ఇతని ప్రచారం ఫలించినట్టే ఉంది.