: తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్లకు వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం: అనురాగ్ శర్మ


తెలంగాణ రాష్ట్రంలో ఇకపై అన్ని పోలీస్ స్టేషన్లకు వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు ఈ సౌకర్యాన్ని అనుసంధానించాలని నిర్ణయించినట్టు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఫైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్ బాగ్ లోని కమిషనరేట్ కార్యాలయంలో వీసీ వ్యవస్థను డీజీపీ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీఎస్పీలు, పర్యవేక్షించే సబ్-డివిజన్, సర్కిల్ ఆఫీస్ లతో పాటు పోలీస్ స్టేషన్లనూ ఈ వ్యవస్థ ద్వారా అనుసంధానించాలని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా వివరించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ స్థితిగతులతో పాటు నేర స్థలాల పర్యవేక్షణ, నేరగాళ్ల విచారణ, అనుమానితుల గుర్తింపు వంటి పలు అంశాలలో ఈ విధానం కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News