: దేశంలో ఐదో వంతు కంపెనీలు మూతపడ్డాయి: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
డిసెంబర్ 10 నాటికి దేశంలో 2,81,973 కంపెనీలు మూతపడ్డాయని రాజ్యసభకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా దేశంలో 15, 22, 900 కంపెనీలు రిజస్టర్ అయ్యాయని ఆయన చెప్పారు. ఈ లెక్కన దేశంలో ఏర్పాటు చేసిన కంపెనీల్లో ఐదో వంతు కంపెనీలు మూతపడ్డాయని ఆయన పేర్కొన్నారు. 48, 040 కంపెనీలు మూతపడిన ఢిల్లీ ఈ జాబితాలో అగ్రస్థానం సాధించగా, 45, 340 కంపెనీలు మూత పడి పశ్చిమ బెంగాల్, 43, 755 కంపెనీలు మూతపడి మహారాష్ట్రలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. కాగా, రిజిష్టర్ అయి ఎలాంటి విధులు నిర్వర్తించని పలు కంపెనీలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, రిజిష్టర్ నుంచి వాటి పేర్లు తొలగించుకునే వెసులుబాటు మరింత సరళతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.