: కేసీఆర్ లాంటి వాళ్లు మా దగ్గర 20 మంది ఉన్నారు: పొంగులేటి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన వాళ్లు కాంగ్రెస్ పార్టీలో 20 మంది వరకు ఉన్నారని టీకాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తాము తలచుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోక తప్పదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో తమ పార్టీలోని నేతల మధ్య సమన్వయం లేకనే ఓడిపోయాం తప్ప, సత్తా లేక కాదని చెప్పారు. క్యాంపు రాజకీయాలకు, అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న చండీయాగం వల్ల ఉపయోగం ఎవరికని ప్రశ్నించారు.