: రేపు భారత్ వస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్


గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రేపు భారత్ కు వస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో ఆయన సమావేశమవనున్నారు. ముందుగా రేపు ఢిల్లీలో గూగుల్ నిర్వహించే కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులతో సమావేశం అవుతారు. తరువాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లతో భేటీ అవుతారని సమాచారం. రెండో రోజు పర్యటనలో ప్రధాని మోదీ, తరువాత ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే విందుకు పిచాయ్ హాజరవుతారు. గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆయన భారత్ కు వస్తున్నారు.

  • Loading...

More Telugu News