: రిలయన్స్ సంస్థపై కాకినాడలో హర్షకుమార్ ఫిర్యాదు
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ రిలయన్స్ సంస్థపై కాకినాడలోని మెరైన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రూ.11వేల కోట్ల విలువైన ఓఎన్ జీసీ గ్యాస్ ను రిలయన్స్ సంస్థ చోరీ చేసిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. గ్యాస్ దోపిడీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని హర్షకుమార్ చెప్పారు. అయితే గ్యాస్ చోరీపై అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కథనాలను సాక్ష్యాలుగా ఆయన పోలీసులకు చూపించారు.