: జల్లికట్టును నిషేధించాలి: కోహ్లీ, విద్యాబాలన్
తమిళనాడులో అత్యంత పేరుగాంచిన ఎద్దుల క్రీడ 'జల్లికట్టును' నిషేధించాలని కొందరు, కొనసాగించాలని మరికొందరు చాలా ఏళ్లుగా డిమాండ్లను వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, జల్లికట్టును తిరిగి నిర్వహించకూడదని బాలీవుడ్ నటులు, క్రికెట్ స్టార్లు కూడా విన్నవిస్తున్నారు. జల్లికట్టుపై నిషేధానికి తమ మద్దతు పలుకుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ విద్యాబాలన్ లు ఓ విజ్ఞాపన పత్రంపై సంతకం చేసి జల్లికట్టు నిషేధానికి తమ మద్దతు ప్రకటించారు. జల్లికట్టును తిరిగి నిర్వహించకుండా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని 'పెటా' తరపున వారు కోరారు. గత ఏడాది జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. జంతువులకు కూడా ప్రశాంతంగా జీవించే హక్కు ఉంటుందని, తమ వారిని రక్షించుకునే హక్కు వాటికి ఉంటుందని, జంతువులను గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.