: నేపాల్ లో ప్రమాదం... ఆరుగురు భారతీయుల దుర్మరణం


నేపాల్ లో జరిగిన ఒక సంఘటనలో ఆరుగురు భారతీయ కూలీలు దుర్మరణం చెందారు. తూర్పు నేపాల్ లోని ఇటహరి నగరంలోని ఇటుకబట్టీలో చిమ్నీ (పొగగొట్టం) కూలడంతో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనలో భారతీయ కూలీలు సహా మరో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, 25 మంది గాయపడ్డారు. మృతులలో ఇద్దరు నేపాలీ కూలీలు కూడా ఉన్నారు. సోమవారం నాడు 'న్యూ జయ' ఇటుక ఫ్యాక్టరీలో సుమారు పదిలక్షల ఇటుకలను కాల్చుతున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించిన అనంతరం 105 అడుగులు ఉన్న పెద్ద చిమ్నీ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను పోలీసులు కాపాడినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, గత ఏప్రిల్ లో సంభవించిన భూకంపం ప్రభావానికి ఈ ఇటుక బట్టి చిమ్నీ పైభాగం కూలింది. దీనికి మరమ్మతులు చేసి సోమవారం నాడే తిరిగి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News