: నష్టాల నుంచి లాభాల్లోకి స్టాక్ మార్కెట్


సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 70 పాయింట్ల వరకూ నష్టపోయిన బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ఆపై నిదానంగా లాభాల్లోకి వచ్చి దూసుకెళ్లింది. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచిందని నిపుణులు వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 170.09 పాయింట్లు పెరిగి 0.68 శాతం లాభంతో 25,320.44 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 50.85 పాయింట్లు పెరిగి 0.66 శాతం లాభంతో 7,700.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.56 శాతం, స్మాల్ క్యాప్ 0.69 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 32 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బోష్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనీలీవర్, లుపిన్, ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర కంపెనీలు లాభపడగా, టెక్ మహీంద్రా, పీఎన్బీ, ఐడియా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. శుక్రవారం నాడు రూ. 95,87,764 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, సోమవారం నాడు రూ. 96,58,760 కోట్లకు పెరిగింది. మొత్తం 2,852 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,491 కంపెనీలు లాభాలను, 1,147 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

  • Loading...

More Telugu News