: పార్టీ ఫిరాయింపులను ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించినా తప్పే: కోదండరాం


తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న పార్టీ ఫిరాయింపులపై టి.జేఏసీ కన్వీనర్ కోదండరాం స్పందించారు. ఓ పార్టీని వదిలిపోవడంలాంటి అంశాలు అస్థిరతకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించినా తప్పేనని స్పష్టం చేశారు. అయితే పార్టీల మధ్య జరిగే రాజకీయ వివాదాల జోలికి తాము వెళ్లమని హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అందుకే కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలు కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు కళాకారులు పాటలు రాయాలని కోదండరాం కోరారు. త్వరలో టి.జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని, ఆత్మహత్యల నివారణకు ఏంచేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇక కొత్త రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో మెలగాలని సూచించారు. ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News