: పేదరికాన్ని అడ్డు పెట్టుకుని వ్యభిచారంలోకి దింపుతున్నారు... ఎన్ కౌంటర్ చేసినా తప్పు లేదు: సి.రామచంద్రయ్య


విజయవాడలో అరాచక శక్తుల ఆగడాలకు అంతు లేకుండా పోయిందని... ఆ శక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నేతృత్వంలోనే రెచ్చిపోతున్నాయని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. కాల్ మనీ వ్యవహారం బాబు, లోకేశ్ నేతృత్వంలోనే జరుగుతోందని అన్నారు. మహిళల పేదరికాన్ని అడ్డుపెట్టుకుని వారిని వ్యభిచారంలోకి దింపుతున్నారని... అలాంటి వారిని ఎన్ కౌంటర్ చేసినా తప్పు లేదని చెప్పారు. తన అనుచరులకు మేలు చేయడానికే చంద్రబాబు ఈ మాఫియాను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News