: ఎస్పీబీ కోసం పాట పాడిన కీరవాణి
గాయకుడిగా అర్ధ శతాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ అరుదైన కానుకను అందించారు. బాలూ పాటలను గుర్తు చేసేలా ఓ పాట పాడి దాన్ని రికార్డు చేసి, తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘యాభై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలుగారి గళము’ అని కీరవాణి పాడుతుంటే, బాలూ పాత చిత్రాలు, ఫోటోలతో ఆయన డబ్బింగ్ చెప్పిన రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలు, బాలూ వివిధ సినిమాలలో ధరించిన విభిన్న పాత్రల తాలూకు ఫోటోలు, ఆయనతో కలసి పనిచేసిన దర్శక దిగ్గజాలు, వేటూరి వంటి గేయ రచయితలు, అన్నమయ్య, అడవి రాముడు తదితర చిత్రాల దృశ్యాలతో కూడిన వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు.