: ఢిల్లీ నుంచి ఆమ్ స్టర్ డామ్ నాన్ స్టాప్ సర్వీస్ 2016 నుంచి: జెట్ ఎయిర్ వేస్


ఢిల్లీ నుంచి అమ్ స్టర్ డామ్ (నెదర్లాండ్స్)కు ప్రతిరోజూ నాన్ స్టాప్ విమాన సర్వీసును నడిపేందుకు చర్యలు చేపట్టబోతున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. దాంతో పాటు ముంబై-ఆమ్ స్టర్ డామ్, టొరంటో (కెనడా)- ఆమ్ స్టర్ డామ్ లకు కూడా నాన్ స్టాప్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపింది. 2016 మార్చి 27 నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని వివరించింది. ఇవాళ నుంచి ఈ విమాన సర్వీసులకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. అన్ని బుకింగ్ ఛానళ్ల నుంచి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని జెట్ సంస్థ చెప్పింది.

  • Loading...

More Telugu News