: కేజ్రీవాల్ కార్యదర్శి దగ్గర విదేశీ నగదు: సీబీఐ వర్గాలు


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ ఇంట్లో తాము జరిపిన తనిఖీల్లో విదేశీ కరెన్సీ బయటపడిందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయన కార్యాలయంలో, ఇంట్లో ఉదయం నుంచి సీబీఐ సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. రూ. 3 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీ తో పాటు రూ. 2.4 లక్షల లెక్కల్లో లేని డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజేంద్ర ఇంట్లో దాడులపై మరికాసేపట్లో సీబీఐ ప్రతినిధులు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా, రాజేంద్ర వద్ద ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News