: రేపు శృంగేరి మఠానికి వెళుతున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కర్ణాటకలోని శృంగేరి మఠానికి వెళుతున్నారు. తన ఫామ్ హౌస్ లో నిర్వహించనున్న అయుత చండీయాగానికి శృంగేరి శారదా పీఠం పీఠాధిపతి భారతీ తీర్థస్వామిని ఆహ్వానించడానికి ఆయన బయల్దేరుతున్నారు. రేపు ఉదయం 10.30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి తొలుత మంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శృంగేరి మఠానికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు శృంగేరి మఠానికి చేరుకుని, భారతీ తీర్థస్వామికి ఆహ్వాన పత్రిక అందజేస్తారు. అనంతరం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.