: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి నుంచి బుల్లెట్లు స్వాధీనం
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బుల్లెట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు సాయిరామ్ అనే వ్యాపారి విమానాశ్రయానికి వచ్చాడు. అతన్ని ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సమయంలో 8 బుల్లెట్లు ఉన్నాయని గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరామ్ ను విచారిస్తున్నారు. చాలా రోజల కిందట కూడా ఇదే ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి నుంచి బుల్లెట్లు లభ్యమయ్యాయి.