: మాకీ సెజ్ వద్దు...మా భూములు మాకిచ్చేయండి: తిరగబడ్డ రైతులు
'సెజ్ మాకు వద్దు, మా భూములు మాకిచ్చేయండి' అంటూ రైతులు తిరగబడిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో సెజ్ భూములకు సరిహద్దులుగా పాతిన స్తంభాలను తొలగించిన రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 200 మంది రైతులు ఒకేసారి చొచ్చుకురావడంతో వారిని నిలువరించడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో కాకినాడ నుంచి అదనపు బలగాలను రప్పించుకున్నారు. సెజ్ ను రద్దు చేసి, తమ భూములు తమకు అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.