: సిడ్నీ ఎయిర్ పోర్టులో ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కు చేదు అనుభవం
బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కు సిడ్నీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. క్వాంటాస్ ఎయిర్ లైన్స్ లో టికెట్ కలిగివున్న ఆయన్ను, విశ్రాంతి గదిలోకి అనుమతించలేదు. దీనిపై కెవిన్ తీవ్రంగా మండిపడ్డాడు. క్వాంటాస్ సంస్థ ఓ పిచ్చిదని చెబుతూ ట్వీట్ చేశాడు. ఇటువంటి పరిస్థితిని తానెన్నడూ ఎదుర్కోలేదని చెప్పుకొచ్చాడు. జరిగిన ఘటన గురించి తెలుసుకున్న క్వాంటాస్ అధికారులు క్షమాపణలు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి విశ్రాంతి గది డ్రస్ కోడ్ లు మారాయని, పీటర్సన్ ఎవరో తెలుసుకోలేక, తమ సిబ్బంది తప్పు చేశారని వివరణ ఇచ్చింది. ఆయన డ్రస్ పై కొన్ని ప్లాస్టిక్ ను పోలిన వస్తువులు ఉండటం వల్లే పీటర్సన్ ను రానివ్వలేదని తెలుస్తోంది.