: టీఆర్ఎస్ లో విభేదాలు ప్రెషర్ కుక్కర్ లా ఎప్పుడైనా పేలొచ్చు: మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
అధికార పార్టీ టీఆర్ఎస్ లో విభేదాలు ప్రెషర్ కుక్కర్ లా ఉడుకుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవి ఎప్పుడైనా పేలవచ్చని ఎద్దేవా చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ ప్రాధాన్యత చూసి మరో మంత్రి హరీశ్ రావు ఆందోళన పడుతున్నారని ఆరోపించారు. పార్టీలో తన ఉనికి కాపాడుకోవాలని ఆయన అదే పనిగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 45 డివిజన్లను గెలుచుకుంటుందని సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.