: పుట్టపర్తి వ్యవహారంలో సచిన్ ప్రస్తావన


పుట్టపర్తి సత్యసాయి బాబా శివైక్యం చెందిన తర్వాత అనేక వివాదాలు ఆ ఆధ్మాత్మిక కేంద్రాన్ని చుట్టుముట్టాయి. ఆయన వీలునామా రాశారని కొందరంటుంటే, సత్యసాయికి సన్నిహితుడుని ముద్రపడ్డ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ మాత్రం బాబా వీలునామా రాయలేదని అంటున్నారు. అంతేగాకుండా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బాబా బంగారు విగ్రహాన్ని ఇస్తానని ఎన్నడూ చెప్పలేదని తెలిపారు. ఇక బాబా వీలునామా గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ట్రస్ట్ తరుపునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు ట్రస్ట్ కు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని రత్నాకర్ చెప్పారు.

  • Loading...

More Telugu News