: నడి సముద్రంలో, యుద్ధనౌకలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో మోదీ కీలక భేటీ
కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇండియాలోని అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు. కొచ్చి తీరానికి 40 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న నౌకను చేరుకున్న ఆయన, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. దేశ భద్రత, సముద్ర జలాల్లో గస్తీ తదితర అంశాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా హాజరయ్యారు. వీరి సమావేశం గురించి మరింత సమాచారం వెలువడాల్సి వుంది. కాగా, విక్రమాదిత్య పైకి ప్రధాని వెళ్లడం ఇది రెండోసారి. గడచిన జూన్ నెలలో ఈ యుద్ధ నౌక జాతికి అంకితమైన సంగతి తెలిసిందే.