: కాల్ మనీ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలి: డొక్కా
ఏపీలో నకిలీ మద్యం, కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి స్థాయి వ్యక్తులున్నా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఎవరినీ వదిలిపెట్టవద్దని అన్నారు. ముఖ్యంగా కాల్ మనీ వ్యవహారం రాష్ట్రంలో ఎప్పటి నుంచో సాగుతోందన్న ఆయన, సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు రాజకీయాలకు అతీతంగా పార్టీలు కలసిరావాలని విజ్ఞప్తి చేశారు. మద్యం వ్యవహారం నేపథ్యంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలంటూ డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్... ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని చెప్పారు. సంపూర్ణ మద్య నిషేధం అంటే మద్యం మాఫియాను ప్రోత్సహించడమేనని డొక్కా అన్నారు.