: పుణె జట్టుకు ధోనీ, రహానె... రాజ్ కోట్ కు రైనా, జడేజాలు ఎంపిక
ఐపీఎల్ లో కొత్త జట్లు అయిన పుణె, రాజ్ కోట్ లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి. ఈ మేరకు ముంబైలో నిర్వహించిన వేలంలో పుణె జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ, అశ్విన్, రహానె, స్టీవెన్ స్మిత్ లు ఎంపికయ్యారు. ఇక రాజ్ కోట్ జట్టుకు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, మెక్ కల్లెమ్ లను ఎంచుకున్నారు. ఈ వేలంలో ధోనీ, రైనాలను ఇరు జట్లు అత్యధికంగా 12.5 కోట్లకు కొనుగోలు చేశాయి. ఇక రహానె రూ.9.5 కోట్లు, అశ్విన్ రూ.7.5 కోట్లు, జడేజా రూ.9.5 కోట్లకు ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్నాయి. వచ్చే రెండు ఐపీఎల్ సీజన్ల కోసం ఈ వేలం నిర్వహిస్తున్నారు.