: గవర్నర్ ను కలసిన జగన్... బాక్సైట్, కాల్ మనీ వ్యవహారాలపై ఫిర్యాదు
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు, విజయవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ జగన్ వినతిపత్రాన్ని నరసింహన్ కు అందజేశారు. గవర్నర్ ను కలసిన సమయంలో జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఉన్నారు.