: ఆంధ్ర బిర్యానీని పేడతో పోల్చిన కేసీఆర్... ఇప్పుడు, చంద్రబాబు విందు బాగుందంటున్నారు: వైకాపా


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ల ఏకాంత సమావేశాలు, చర్చల గుట్టు ఏమిటో బయటపెట్టాలని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వైకాపా ఓటు వేసినందుకు... చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారని... ఇప్పుడేమో ఇరు పార్టీల అధినేతలు ఏకాంత చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఆంధ్ర బిర్యానీ పేడలా ఉంటుందని విమర్శించిన కేసీఆర్... ఇప్పుడు చంద్రబాబు తనకు ఇచ్చిన విందు చాలా బాగుందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును ఇద్దరు నేతలూ మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News