: ఏ ఫైల్ కావాలో చెప్పు... నేనే ఇస్తా: మోదీతో కేజ్రీవాల్
ఢిల్లీ సచివాలయంలో ఈ ఉదయం సీబీఐ జరిపిన సోదాలకు రాజకీయ రంగు పులుముకుంది. ఓవైపు తాము సీఎం ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో మాత్రమే సెర్చ్ చేశామని సీబీఐ వర్గాలు చెబుతుంటే, కేజ్రీవాల్ మాత్రం దాన్ని వ్యతిరేకించారు. సీబీఐ వాదనలు అవాస్తవమని చెప్పిన కేజ్రీ, సీఎస్ రాజేంద్రకుమార్ నెపంతో తన కార్యాలయంలోనే సోదాలు జరిగాయని తెలిపారు. తన చాంబర్ లోనే పలు దస్త్రాలను పరిశీలించారని వెల్లడించిన కేజ్రీవాల్, ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ప్రధానికి ఏ ఫైల్ కావాలో చెబితే, తానే స్వయంగా వెళ్లి ఇస్తానని అన్నారు. రాజకీయ కుట్రలు జరుపుతూ, సీబీఐని ఉసిగొల్పడమేంటని ప్రశ్నించారు.