: టీటీడీలో 60వేల లడ్డూల అక్రమ బాగోతం


తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో అక్రమ బాగోతం బయటికి వచ్చింది. టీటీడీలో అటెండర్ గా పనిచేస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగి దాతలకు అందించే 60వేల లడ్డూలను పక్కదారి పట్టించినట్టు తెలిసింది. ఏడాదికాలంగా లడ్డూలను బ్లాక్ లో విక్రయిస్తున్నాడని గుర్తించారు. వెంటనే అతడిని ఈవో సాంబశివరావు సస్పెండ్ చేశారు. రెండున్నరేళ్లుగా రమణ డోనర్ సెల్ లో పనిచేస్తున్నాడని విజిలెన్స్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తుండగా, ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News