: సాలూరులో సంచలనం... తమ్ముడు, మరదలిపై యాసిడ్ దాడి చేసిన అన్న
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ అన్న దారుణానికి ఒడిగట్టాడు. సొంత తమ్ముడు, మరదలు అని చూడకుండా వారిపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరులో నేటి తెల్లవారుఝామున జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణంలోని నాయుడు వీధిలో నివాసముంటున్న పోలిరాజు, తన తమ్ముడు వెంకటరమణ, మరదలు రాణిలపై యాసిడ్ తో దాడి చేశాడు. వారి మధ్య ఉన్న తగాదాలే ఇందుకు కారణం. తీవ్రంగా గాయపడిన బాధితులను విజయనగరం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.