: గవర్నర్ వద్దకు వైసీపీ అధినేత... కాల్ మనీపై ఫిర్యాదు చేయనున్న వైఎస్ జగన్


ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాదులోని రాజ్ భవన్ వెళ్లనున్న జగన్, విజయవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై గవర్నర్ కు పిర్యాదు చేయనున్నారు. అప్పులిచ్చి, రుణాలు తీర్చలేని కుటుంబాలకు చెందిన ఆడవాళ్లను వ్యభిచార కూపంలోకి లాగుతున్న కాల్ మనీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులు ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతలు, వారి అనుచరులు ఉండటంతో జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించారు. నిన్ననే ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన జగన్, నేడు గవర్నర్ కు సదరు నయా వంచనపై ఫిర్యాదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News