: వారంతా ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఉన్నవారే!: యనమల


కాల్ మనీ దందాలో విజయవాడలో అరెస్టైన వారంతా ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఉన్నవారేనని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కాల్ మనీ వ్యవహారంపై ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ లేఖ రాయడం హాస్యాస్పదం అన్నారు. కాల్ మనీ సహా సంఘ వ్యతిరేక శక్తులను పెంచి పోషించింది జగన్ తండ్రేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి రాసిన లేఖలో జగన్ తన కథ రాయకుండా ఏవేవో కథలు రాశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాము మైక్రోఫైనాన్స్ పై పోరాడమని గుర్తు చేసిన ఆయన, అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నామని, ఎవరూ డబ్బులు కట్టవద్దని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, పార్టీలకతీతంగా విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News