: ఎలా ఉంది పరిస్థితి?: యనమలను ఆరాతీసిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహ్వానం, భోజనం ముగిశాక తిరుగు ప్రయాణానికి ముందు అందరితో మాట్లాడుతూ, ఏపీ ఆర్థిక మంత్రి యనమల చేయిపట్టుకుని పక్కకు తీసుకెళ్లి మరీ ముచ్చట్లు పెట్టారు కేసీఆర్. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. యనమలను పక్కకు తీసుకెళ్లి మరీ కేసీఆర్ ఏం మాట్లాడి ఉంటారు? అంటూ ఆరాలు తీస్తున్నారు. దీనిపై యనమల స్పష్టత నిచ్చారు. లోటు బడ్జెట్ తో విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అంటూ ఆరాతీశారట. కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తున్నాయి? సరిపోతున్నాయా? లేదా? వంటి ప్రశ్నలు వేశారని సమాచారం. అయితే క్లిష్టపరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నామని యనమల ఆయనకు తెలిపినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News