: విదేశీ సైట్లపై నిషేధం కొనసాగుతుంది: చైనా


విదేశీ సైట్లపై నిషేధం కొనసాగుతుందని చైనా ప్రకటించింది. నిషేధం ఎత్తివేసే ఆలోచన లేదని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ ప్రకటన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వంటి సైట్లకు నిరాశను మిగిల్చింది. చైనా వైఖరిలో మార్పు తెచ్చేందుకు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్నివ్వలేదు. చైనీయులను ఆకట్టుకునేందుకు మాండరీన్ భాష నేర్చుకోవడం, తన పాపాయికి పేరు పెట్టాలంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను జుకెర్ కోరడం వంటి చర్యలు వారిని అంతగా ఆకట్టుకోలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News