: టీసీఎస్ పై చెన్నై వరదల ప్రభావం... తగ్గనున్న కంపెనీ ఆదాయం


ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)పై ఇటీవల చెన్నైలో భారీ వర్షాలు, వరదల ప్రభావం పడింది. వరద బీభత్సం కారణంగా ఈ నెలతో ముగిసే త్రైమాసికానికి సంస్థ ఆదాయం తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. "తీవ్ర వాతావరణ పరిస్థితులు, ఆ తరువాత తలెత్తిన వరదలతో అత్యంత ప్రధానమైన కార్యకలాపాలు మినహాయించి డిసెంబర్ 1 నుంచి నగరంలో మన సంస్థ సాధారణ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబర్ 7 నుంచి సంస్థలో కార్యకలాపాలు పునః ప్రారంభమైనప్పటికీ సిబ్బంది హాజరు మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉంది. దాని ప్రభావం భౌతికంగా కంపెనీ ఆదాయంపై పడనుంది" అని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో సంస్థ షేర్లు పతనమవగా, షేర్ విలువ 2.3 శాతానికి పడిపోయింది. మరోవైపు సంస్థ మూడో త్రైమాసికంలో 60 పాయింట్ల వరకు క్వార్టర్ టు క్వార్టర్ ఇంపాక్ట్ ఉంటుందని పరిశీలక సంస్థ నోమురా తెలిపింది. అటు స్టాక్ మార్కెట్ లో టీసీఎస్ వాటాల లక్షిత ధరను రూ.2,670 నుంచి 2,500లకు తగ్గించింది.

  • Loading...

More Telugu News