: సభ్యులు సభకు తప్పనిసరిగా హాజరుకండి ...విప్ జారీ చేసిన బీజేపీ


బీజేపీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజులు రాజ్యసభలో అందరూ అందుబాటులో ఉండాలని బీజేపీ అధిష్ఠానం విప్ జారీ చేసింది. వస్తు సేవల బిల్లు (జీఎస్టీ) రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున పార్టీ సభ్యులంతా అందుబాటులో ఉండాలని విప్ లో స్పష్టం చేసింది. దీంతో ఈ వారంలోనే జీఎస్టీ బిల్లు రాజ్యసభ ముందుకు రానుందని తెలుస్తోంది. కాగా, జీఎస్టీ బిల్లులో మూడు ముఖ్యమైన సవరణలు చేస్తే బిల్లుకు మద్దతు పలుకుతామని, లేని పక్షంలో దానిని అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News