: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కేడీకే వర్మ, ఆర్కే శ్రీవాత్సవ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు షంతుమను, సంజయ్ కుమార్ లను నియమిస్తున్నట్లు తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు చేసే వ్యయం, కోడ్ ఉల్లంఘన తదితర అంశాలపై వారు దృష్టి పెట్టనున్నారు.