: పది రోజుల పాటు నిలిచేలా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో సరికొత్త స్మార్ట్ ఫోన్!
మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. తమ బ్యాటరీ ఎక్కువ సమయం నిలబడడం లేదని ఫిర్యాదు చేస్తున్న వారికి నచ్చేలా చైనా సంస్థ ఓకిటెల్ 10000 ఎంఎహెచ్ బ్యాటరీతో 10 రోజుల పాటు చార్జింగ్ అవసరం లేని కొత్త స్మార్ట్ ఫోన్ 'కే10000'ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ లో 1జీహెచ్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (5.1 లాలీపాప్) ఉంటాయని సంస్థ తన వెబ్ సైట్ లో పేర్కొంది. డ్యూయల్ సిమ్, 5.5 అంగుళాల హెచ్ డీ డీస్ ప్లే, 8/2 ఎంపీ కెమెరాలు, 2 జీబీ రామ్, గొరిల్లా గ్లాస్, 4జీ సదుపాయాలున్న ఈ ఫోన్ ధర 239.99 డాలర్లని (సుమారు రూ. 16 వేలు) తెలుస్తోంది.