: ఇకపై కువైట్ లో చీమ చిటుక్కుమన్నా ప్రభుత్వానికి తెలిసిపోతుంది


ఇకపై కువైట్ లో చీమ చిటుక్కుమన్నా ప్రభుత్వానికి తెలిసిపోనుంది. ఎందుకంటే, దేశమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. 2016 మార్చి నుంచి మొదలు పెట్టి, ఆ సంవత్సరాంతానికి దేశమంతటా ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రతి చిన్న విషయం కూడా కనిపించేలా అత్యాధునిక కెమెరాలు అమర్చనున్నారు. విదేశీయుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో, చీమ చిటుక్కుమన్నా అక్కడ ప్రభుత్వానికి తెలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News