: వరుసగా 13వ నెలలోనూ తగ్గిన టోకు ధరలు!


టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలలోనూ తగ్గింది. అక్టోబరులో 3.8 శాతంగా ఉన్న హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ నవంబర్ లో 1.9 శాతానికి తగ్గింది. సోమవారం నాడు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 1975-76 తరువాత ఓ సంవత్సరం పాటు ద్రవ్యోల్బణం వ్యతిరేక దిశగా (డిఫ్లేషన్) సాగడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు గణాంకాలపై ప్రభావం చూపాయి. ఆహార ఉత్పత్తుల్లో మాత్రం ఒత్తిడి కొనసాగింది. ముఖ్యంగా పప్పుధాన్యాల ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 58 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 85 శాతం పెరుగుదల నుంచి 53 శాతం పెరుగుదలకు చేరాయి. ఇతర అన్ని కమోడిటీ ఉత్పత్తులతో పోలిస్తే, ఈ రెండు విభాగాల్లోనే ధరల పెరుగుదల అత్యధికంగా ఉంది. మొత్తం మీద ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే నవంబరులో 5.20 శాతం వద్ద కొనసాగింది. ఆహారేతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2014తో పోలిస్తే స్వల్పంగా పెరిగి 6.92 శాతానికి చేరింది.

  • Loading...

More Telugu News