: ఇది కాల్ మనీ వికృత రూపం...డబ్బుతో సినిమా తీస్తున్నారు


విజయవాడలో కాల్ మనీ వికృత రూపం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తోంది. విజయవాడలో రౌడీల రాజ్యం నడుస్తోందా? అనేంత భయంకరమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనలో ఏ2 నిందితుడు బౌన్సర్ భవానీ శంకర్ అంటే మహిళలు వణికిపోతున్నారు. ఏ1 నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాముకు బౌన్సర్లను భవాని శంకర్ సరఫరా చేస్తుంటాడు. అంటే రాము దగ్గర అప్పుతీసుకుని చెల్లించని వారి లిస్టును భవానీ శంకర్ కు పంపిస్తాడు. అంతే, ఇక భవానీ శంకర్ తన ప్రతాపం చూపిస్తాడు. బాడీ బిల్డింగ్ మోజులో ఉన్న వారిని తనతో బాధితుల ఇంటికి తీసుకెళ్లి, అక్కడి మహిళలపై ప్రతాపం చూపిస్తాడు. ముందు నోటికి వచ్చిన బూతులన్నీ తిడతాడు. తరువాత వారిపై బల ప్రయోగం చేస్తాడు. తనను అడ్డుకునే క్రమంలో ఆ మహిళలను వివిధ భంగిమల్లో ఫోటోలు తీయిస్తాడు. ఆ ఫోటోలను తిరిగి వారికే పంపి తన ఆఫీసుకు రప్పించుకుంటాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, అఘాయిత్యం జరిపి దానిని వీడియో తీసి వారిపై బెదిరింపులకు దిగుతాడు. ఇక అప్పటి నుంచి వారు భవనీ శంకర్ కు బానిసలే. ఇలా సంపాదించిన డబ్బుతో కాల్ మనీ పార్టనర్స్ అంతా గ్రూప్ గా తయారై భవనీ శంకర్ ను హీరోగా పెట్టి 'బాడీ బిల్డర్' అనే సినిమా తీస్తున్నారు. మూడు రోజుల గాలింపు తరువాత కాల్ డేటా ఆధారంగా భవానీ శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కాల్ మనీలో నిందితులు బెయిల్ పై బయటకు వచ్చాక మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News