: పరీక్షలు వాయిదా వేయాలంటూ ఓయూలో విద్యార్థుల ఆందోళన!


ఉస్మానియా యూనివర్శిటీలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీస్ బందోబస్తు మధ్య సెమిస్టర్ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. వాయిదా వేయాలంటూ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. అయితే, యూనివర్శిటీ అధికారులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు యథాతథంగానే జరుగుతాయని చెప్పారు. యూనివర్శిటీ అధికారుల తీరును నిరసిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పరీక్షలు వాయిదా వేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News