: గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నాం: జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు 50 వేల మంది ఉద్యోగులు అవసరమని, ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులను రప్పిస్తున్నామని చెప్పారు. 8 వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 11 వేలకు పైగా ఈవీఎంలను ఉపయోగించనున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు శిక్షణ నిస్తున్నామన్నారు. ఓటు వేయడంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని జనార్దన్ రెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News