: డాబర్ 'రియల్ జ్యూస్'లో నాణ్యతా లోపం, 77 కంటెయినర్లను సీజ్ చేసిన నేపాల్


డాబర్ ఇండియా అనుబంధ డాబర్ నేపాల్ సంస్థ తయారు చేస్తున్న రియల్ జ్యూస్ లో నాణ్యతా ప్రమాణాలు లేవని ఆరోపిస్తూ, 77 కంటెయినర్ల జ్యూస్ ప్యాకెట్లను నేపాల్ ప్రభుత్వం సీజ్ చేసింది. వీటిని ఇండియాకు తరలించేందుకు సిద్ధం చేసి బిర్జుంగ్ లోని సిర్సియా డ్రై పోర్టులో సిద్ధంగా ఉంచగా, సీఐఏఏ (కమిషన్ ఫర్ ది అబ్యూజ్ ఆఫ్ అధారిటీ) అధికారులు వీటిని సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని, డాబర్ గోడౌన్లలో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, కొందరు ప్రజలు ఎక్స్ పైరీ తేదీ అయిపోయిన ప్రొడక్టులను డాబర్ విక్రయిస్తోందని ఆరోపించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాగా, గత రెండు నెలలుగా నేపాల్ - భారత్ సరిహద్దులను మధేసీలు బ్లాక్ చేయడంతో సెప్టెంబరులో తరలించాల్సిన కంటెయినర్లు ఆగిపోయాయని, వాటినే ఇప్పుడు సీజ్ చేశారని డాబర్ నేపాల్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయినప్పటికీ వీటి ఎక్స్ పైరీ తేదీ ముగియలేదని అన్నారు. విచారణకు సహకరిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News