: చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానించిన కేసీఆర్


ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీ యాగానికి ఆహ్వానించారు. తప్పకుండా యాగానికి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రిక, పండ్లు బాబుకు సమర్పించి తెల్లని శాలువా కప్పారు. యాగానికి సంబంధించిన వివరాలను కేసీఆర్ బాబుకు తెలిపారు. ఈ సమయంలో కేసీఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉండగా, మరోవైపు ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, అచ్చెన్నాయుడు ఉన్నారు. అంతకుముందు విజయవాడకు సమీపంలోని ఉండవల్లిలో తన నివాసానికి చేరుకున్న కేసీఆర్ కు ప్రధాన ద్వారంలోనే చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పారు. మరికొద్దిసేపట్లో కేసీఆర్ కు తన నివాసంలో చంద్రబాబు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం 15 రకాల ఆంధ్ర వంటకాలను తయారు చేయించారు.

  • Loading...

More Telugu News