: నెల రోజుల తరువాత... చెన్నైలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు


తమిళనాడు రాజధాని చెన్నైలో ఇవాళ్టి నుంచి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో చెన్నైతో బాటు, పలు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. కొన్ని రోజుల నుంచి వర్షాలు తగ్గిపోవడం, పరిస్థితులు మెరుగుపడటంతో పాఠశాలను పునః ప్రారంభిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే తీవ్రంగా ధ్వంసమైన పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతుందని అధికారులు చెప్పారు. నెల రోజుల సెలవుల వల్ల విద్యార్థులు వెనకబడే అవకాశం ఉంది కాబట్టి... ఇక నుంచి ఎక్కువ గంటలు తరగతులు నిర్వహించాలని, ఆదివారాల్లో కూడా పాఠశాలలు పెట్టాలని విద్యా సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు వరదల్లో సమస్తం కోల్పోవడంతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది.

  • Loading...

More Telugu News