: అమర్ సింగ్ కు తీవ్ర అనారోగ్యం... ఆసుపత్రికి తరలింపు
సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నేటి ఉదయం ఉన్నట్టుండి నొప్పి రావడంతో ఆయన సతమతమయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఐదారేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అమర్ సింగ్ సిఫారసు కారణంగానే సమాజ్ వాదీ పార్టీ అధిష్ఠానం గతంలో తెలుగు నటి జయప్రదకు ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమర్ సింగ్ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత జయప్రద కూడా దాదాపుగా రాజకీయాలకు దూరమైపోయారు.