: మల్లాది విష్ణు నెత్తిన మరో పిడుగు... కాల్ మనీలోనూ కాంగ్రెస్ నేత అనుచర వర్గం


అసలే ఓటమి.. ఆపై పార్టీ అధికారం కోల్పోయింది. ఇంకేముంది, సైలెంట్ అయిపోయి తన పని తాను చేసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అదే పనిచేస్తున్నారు. అయితే ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ పేరిట విజయవాడలోని కృష్ణలంక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణ బార్ లో కల్తీ మద్యం ఘటనతో ఆయనకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టైంది. ఐదుగురు దినసరి కూలీలను పొట్టనబెట్టుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఏకంగా ఆయన పేరు కూడా చేరిపోయింది. దీంతో మల్లాది విష్ణు ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కల్తీ మద్యం ఘటన మరుగునపడక ముందే విజయవాడలో కాల్ మనీ వ్యవహారం వెలుగుచూసింది. ఇందులోనూ మల్లాది విష్ణు అనుచర వర్గానికి పాత్ర ఉందని నేటి ఉదయం బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మల్లాది విష్ణు అనుచరుడు గణేశ్ రూ.1 లక్ష ఇచ్చి అందుకు బదులుగా రూ.4 లక్షలు వసూలు చేశాడని సులోచన అనే మహిళ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాక తన ఇంటిని కూడా గణేశ్ లాక్కున్నాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. దీంతో మల్లాది విష్ణు మరింత చిక్కుల్లో పడ్డట్లైంది.

  • Loading...

More Telugu News