: అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారా... ఇక అమెరికా వీసా హుళక్కే!


మీరు ఎప్పుడైనా అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారా? అవి ఆన్ లైన్లో స్నేహితులతో సరదాగా చేసినా సరే... లేదా సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా చేసిన పోస్టుకు లైక్ కొట్టినా సరే... 9/11 దాడులపై వ్యాఖ్యానించినా, తగలబడుతున్న అమెరికా జెండాను లైక్ చేసినా... ఇక అమెరికా వెళ్లాలన్న ఆలోచనను జీవిత కాలం పాటు విరమించుకోవాల్సిందే. కాలిఫోర్నియా ఘటన తరువాత అమెరికన్ వీసాలు పొందుతున్న వారు తమ జీవిత భాగస్వాములను తెచ్చుకునేందుకు పెడుతున్న దరఖాస్తులపై మరింత కఠినంగా వ్యవహరించాలని, వీసా ఇచ్చే ముందు అన్ని రకాలుగా పరీక్షించాలని నిర్ణయం తీసుకుంది. పాక్ మహిళా టెర్రరిస్టుకు అమెరికా వీసా ఇచ్చే ముందు ఆమె సామాజిక మాధ్యమాల్లో జీహాద్ కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను గుర్తించలేకపోవడం అధికారుల పెను తప్పిదమని యూఎస్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, ఇకపై ఫియాన్సీ వీసాలపై మరింత కఠినంగా ఉండాలని, వీసాలు ఇచ్చే ముందు వారి చరిత్ర, ఆన్ లైన్లో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులనూ నిశితంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. ఫియాన్సీ వీసా లేదా కే1 వీసా నిబంధనలను కఠినం చేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ వెల్లడించారు. కే1 వీసాలు తీసుకుని అమెరికాకు వచ్చిన కొందరు ఇక్కడి భూభాగంపై ఉగ్రకలాపాలకు పాల్పడుతున్నట్టు తమకు సమాచారముందని ఆయన స్పష్టం చేశారు. కాగా, 2014లో అమెరికా 35 వేల ఫియాన్సీ వీసాలను ఇచ్చింది. వీటిల్లో భాగంగానే తఫ్సీన్ మాలిక్ కూడా అమెరికాలోకి ప్రవేశించింది. ఇప్పటివరకూ తమ రొటీన్ చెక్ లో భాగంగా వీసా అధికారులు సామాజిక మాధ్యమాలను తనిఖీల్లో చేర్చలేదు. ఇకపై వాటినీ పరిశీలనా జాబితాలోకి చేర్చినట్టు జోష్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News