: ఆ రచయితలిద్దరూ ఒకేరోజు చనిపోవడం బాధాకరం: దాసరి
ప్రముఖ సినీ రచయితలు సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి మరణంపై దర్శకుడు దాసరి నారాయణరావు స్పందించారు. వారిద్దరూ ఒకేరోజు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానన్నారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత అయిన గొర్తి సత్యమూర్తి (61) చెన్నైలోని తన నివాసంలో తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటు చక్రవర్తి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.