: అజ్ఞాతం వీడని మల్లాది విష్ణు... గాలింపును ముమ్మరం చేసిన పోలీసులు


బెజవాడలో రెక్కాడితేనే గాని డొక్కాడని ఐదుగురు దినసరి కూలీలను పొట్టనబెట్టుకున్న కల్తీ మద్యం కేసు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మెడకు చుట్టుకుంది. మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్య ఆధ్వర్యంలో నగరంలోని కృష్ణలంకలో నడుస్తున్న స్వర్ణ బార్ లో మద్యం సేవించిన కారణంగానే ఐదుగురు చనిపోగా, 29 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బార్ తన తమ్ముడి పేర ఉండటం, ఆయన తల్లి బాల త్రిపుర సుందరమ్మకు వాటా ఉన్న నేపథ్యంలో మల్లాది విష్ణు పేరును కూడా పోలీసులు ఏఫ్ఐఆర్ లో చేర్చారు. ఆ మరుక్షణం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మల్లాది విష్ణు పోలీసులకు షాకిచ్చారు. అయితే ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనన్న భావనతో విజయివాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాదు, ఒడిశాలోని కటక్ లలో మల్లాది ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు రెండు నగరాలకు వెళ్లారు. ప్రస్తుతం మల్లాది విష్ణు కోసం పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News