: పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలు
ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 59 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఈ నెల 16న సీ29 వాహక నౌక సింగపూర్ కు చెందిన ఆరు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఆరు ఉపగ్రహాల్లో 400 కిలో టెలిమోన్ ఉపగ్రహం ఒక్కటే పెద్దది. మిగతా ఐదు నానో ఉపగ్రహాలు. మొత్తం ఉపగ్రహాల బరువు 625 కిలోలు. ఈ ఉపగ్రహాలను మోసుకుని ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.